- క్రికెట్ టోర్నీ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే రసమయి సూచన
- కల్లేపల్లిలో హట్టహాసంగా ప్రారంభమైన జిల్లాస్థాయి క్రికెట్ టోర్నీ
నవతెలంగాణ-బెజ్జంకి
గ్రామాల్లోని క్రీడాకారులు రాష్ట్ర జిల్లాస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చితేనే ఆ గ్రామాలు పేరుప్రఖ్యాతులు గడిస్తాయని స్థానిక ప్రజాప్రతినిధులు క్రీడలను నిర్వహిస్తూ క్రీడాకారుల్లోని నైపుణ్యాలను వెలికితీయాలని ఎమ్మెల్యే రసమయి బాలకీషన్ సూచించారు. శనివారం మండల పరిధిలోని కల్లేపల్లిలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి క్రికెట్ టోర్నీని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే రసమయి బాలకీషన్ హట్టహాసంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి మాట్లాడారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లోని క్రీడకారులను వెలికితీయడానికి క్రీడలను ప్రోత్సహిస్తుందన్నారు.మండల కేంద్రంలో సకల సౌకర్యాలతో నూతన మిని స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తున్నమన్నారు. బేగంపేట గ్రామానికి చెందిన లబ్ధిదారునికి రూ.30 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల, ఎఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్ రాజయ్య, లక్ష్మారెడ్డి, సర్పంచులు దారం లక్ష్మి, సంజీవరెడ్డి, టీఆర్ఎస్ మండలాద్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ సభిత, ఎఎంసీ, పీఎసీఎస్ డైరెక్టర్లు దీటీ రాజు, దీటీ బాలనర్స్, అయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ అనుబంధ కమిటీల నాయకులు బిగుల్ల మోహన్, బిగుల్ల రాజయ్య, నాయకులు లక్ష్మన్, తిరుపతి, ఎలా శేఖర్ బాబు, క్రీడాకారులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 Jan,2022 09:13AM