నవతెలంగాణ నవీపేట్:
మండలంలోని ఫకీరాబాద్ గ్రామంలో తెలంగాణ క్రికెట్ టోర్నమెంట్ను సర్పంచ్ నీలేష్ కుమార్ తో కలిసి టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి దొంత ప్రవీణ్ కుమార్ టోర్నమెంట్ను శనివారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ యువకులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని అన్నారు. క్రీడలు మానసిక ఉత్సాహం తో పాటు శారీరక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి అని అన్నారు. టోర్నమెంట్ ఖర్చులతో పాటు బహుమతుల విషయంలో కూడా సహకరిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఇందూరు హరీష్, మహాంతం సర్పంచ్ రాజేశ్వర్, విడిసి చైర్మన్ ముత్యం, సతీష్, ఈర్నాల స్వామి టోర్నమెంట్ ఆర్గనైజర్ లు రియాజ్, అబ్బాస్, సద్దాం, పోతన్న, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm