నవతెలంగాణ-బెజ్జంకి
మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఎస్పీ అధినేత్రి కూమారి మాయవతి చిత్రపటం ఏర్పాటు చేసి మండల దళిత్ శక్తి ప్రోగ్రాం (డీఎస్పీ) ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల డీఎస్పీ మండలాద్యక్షుడు లింగాల సురేష్ మహారాజ్ కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. భారత దేశంలో దళిత సామాజిక వర్గానికి చెందిన మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఘనత కూమారి మాయవతిదేనని లింగాల సురేష్ మహారాజ్ ఆనందం వ్యక్తం చేశారు. ఉపాధ్యక్షుడు మహేందర్ మహారాజు, ప్రధాన కార్యదర్శి మహంకాళీ సురేష్ మహారాజ్, కోశాధికారి జెరిపోతుల రవి మహారాజ్, బీఎస్పీ బెజ్జంకి కార్యకర్త లింగాల శంకర్ మహారాజ్, మిద్దె శంకర్ మహారాజ్, జుట్టు మధు మహారాజ్, జుట్టు చందు మహారాజు ,రామంచ శ్రీకాంత్ మహారాజు, రామంచ కనకయ్య మహారాజు , కొడముంజ శంకర్ మహారాజు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 Jan,2022 10:06AM