- స్వేరోస్ సిద్దిపేట జిల్లాద్యక్షుడు బొర్ర సురేష్ కుమార్
- మండలంలో విసృతంగా స్వేరోస్ సభ్యత్వ నమోదు
నవతెలంగాణ-బెజ్జంకి
బహుజన వర్గాల ప్రజల అక్షరం,ఆరోగ్యం,ఆర్థికమే పని చేస్తున్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లక్ష్యాన్ని గడపగడపకు ఏనుగును తీసుకెళ్లడమే "స్వేరోస్" ముఖ్యపాత్రని సిద్దిపేట జిల్యాద్యక్షుడు బొర్ర సురేష్ కుమార్ తెలిపారు. శనివారం మండల కేంద్రంతో పాటు ముత్తన్నపేట, కల్లేపల్లి, పెరుకబండ, గుండారం గ్రామాల్లో స్వేరోస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విసృతంగా చేపట్టారు. స్వేరోస్ మండలాద్యక్షుడు ఉప్పులేటి బాబు, చిలుముల మోహన్, టీజీపీఏ మండలాద్యక్షుడు బోనగిరి ఆనంద్, గురుకుల పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm