- అరెస్టు చేసిన ఉపాధ్యాయులను వెంటనే విడుదల చేయాలి
- డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నాయకుల డిమాండ్
నవతెలంగాణ కంటేశ్వర్
317 జీవో బాధిత ఉపాధ్యాయుల అరెస్టు అక్రమం అని అరెస్టు చేసిన ఉపాధ్యాయులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. 317 జీవో ద్వారా అన్యాయానికి గురైన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసుకోడానికి ప్రగతి భవన్ కు వెళ్ళిన వందలాది మంది ఉపాధ్యాయులను అరెస్టు చేయడం అక్రమం, తక్షణమే అరెస్టు చేయబడిన ఉపాధ్యాయులను విడుదల చేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు సంక్రాంతి పండుగ రోజు అయినా పండుగ జరుపుకోకుండా ఉపాధ్యాయులు 317జీ ఓ ద్వారా స్థానికతను కోల్పోయిన వారు, సీనియార్టీ లో అన్యాయం జరిగిన ఉపాధ్యాయులు, తమకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి విన్నవించుకునేందుకు ఈరోజు ఉదయం 11 గంటల నుండి వందలాదిమంది ప్రగతి భవన్ చేరుకునేందుకు ప్రయత్నించగా ప్రగతి భవన్ దారిలోనే వందలాది మంది ఉపాధ్యాయులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. ఈ అక్రమ అరెస్టులు మధ్యాహ్నం 3:00 గంటల గంటల వరకు కొనసాగింది. ఇది అప్రజాస్వామిక విధానం , ఇప్పటికైనా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా స్థానికతను కోల్పోయి నష్టపోయిన ఉపాధ్యాయులకు మరియు సీనియార్టీలో అన్యాయం జరిగిన వారితో పాటు , భార్య భర్తలు ఒకే జిల్లాలో ఉండే విధంగా వెంటనే ఉత్తర్వులు వెలువరించి చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన ప్రకటనలో రాష్ట్ర ఉపాధ్యక్షులు శంతన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాలయ్య రాజన్న లు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 Jan,2022 02:49PM