నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ ప్రాంతంలో గల తన చిన్ననాటి స్నేహితులు అందరూ ఒక దగ్గర కలిసి ఆ బిల్డింగ్ పై ఉదయం నుండి సాయంత్రం వరకు సంక్రాంతి పండగను పురస్కరించుకొని పతంగులను ఎగురవేశారు. ఉదయం నుండి సాయంత్రం వరకు అంగరంగ వైభవంగా పండగను జరుపుకొని ఒకరికొకరు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఇందులో పోలీస్ శాఖ, జర్నలిస్టు, వెటర్నరీ డిపార్ట్మెంట్ లో విధులు నిర్వహించే వైద్య బృందం, ఐ అండ్ పీఆర్, రిజిస్ట్రేషన్ కార్యాలయంలో విధులు నిర్వహించే ఉద్యోగి, ఆయుర్వేద వైద్యుడు, ఆర్టిఏ కార్యాలయంలో ఏజెంట్, ప్రవేట్ జాబులు చేసుకునే వారు ప్రతి ఒక్కరు ఒక చోట చేరి పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
Mon Jan 19, 2015 06:51 pm