నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ నగరంలో బుస్సాపూర్ శంకర్ నివాసంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కో కన్వీనర్ బుస్సాపూర్ శంకర్ సూర్యాపేట జిల్లా తాళ్ళకాంపహడ్ లో దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తగుల బెట్టడం అనాగరిక చర్య అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కో - కన్వీనర్ బుస్సాపూర్ శంకర్ అన్నారు. ఈ మేరకు ఆదివారం నిజామాబాద్ నగరంలో బుస్సాపూర్ శంకర్ స్వగృగంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కి పాలాభిషేకం చేసి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, నిరుపేదలకు అండగా ఉండి పలురకాల అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించి, ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టి అమలు పరచిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో శర్మిలమ్మ ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు కావాలనే ఇలా వైఎస్ఆర్ విగ్రహాన్ని తగలబెట్టి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు అని అన్నారు. ఇప్పటికీ తెలుగువారి గుండెల్లో కొలువై ఉన్న దివంగత ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తగలబెట్టడం అనాగరిక చర్య అని ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన వారిని వెంటనే పట్టుకొని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో యువ నాయకులు ప్రితం , అభి , రాహుల్ , సాయి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 Jan,2022 03:44PM