- తెలంగాణ ఫుట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి, అంతర్జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారుడు ఫల్గుణ
నవతెలంగాణ కంటేశ్వర్
భారతదేశ జట్టుకు ఎన్నికైన గుగులోత్ సౌమ్య కేరళ క్యాంపులో చేతి మణికట్టు దగ్గర గాయం అవ్వడంతో వైద్యులు రెండు నెలల విశ్రాంతి సూచించడంతో ఆమె క్యాంపు నుంచి అర్ధాంతరంగా నిజామాబాద్ కు తిరిగి వచ్చారు. తనకు జరిగిన గాయంతో బాధ పడుతున్న గుగులోత్ సౌమ్యను ఆదివారం శాప్స్ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, ఫుట్ బాల్ అసోసిషయ్షన్ కార్యదర్శి ఫల్గుణ, నరాల సుధాకర్, శఖీల్, సాయిలు తదితరులు పరామర్శించారు.
ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయానికి హామి..
గత ఏడు సంవత్సరాల నుండి వివిధ విభాగాల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సౌమ్యకు ప్రభుత్వం తరపున ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని శాప్స్ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి హామి ఇచ్చారు. వీడియో కాల్ లో మాట్లాడి పరామర్శించిన రాష్ట్ర క్రీడా శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్రీడాకారులకు గాయాలు చాలా సాధారణమని గాయాలతో కృంగిపోవద్దని ధైర్యం చెప్పారు. ఆమెకు మెరుగైన వైద్యం అవసరమైతే హైదరాబాద్ నందు ప్రభుత్వ ఖర్చులతో చేయిస్తానని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హామి ఇచ్చారు. ఈ సందర్భంలో రాష్ట్ర ఫుట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఫల్గుణ మాట్లాడుతూ సౌమ్యకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు నివాస స్థలం కేటాయించాలని ప్రభుత్వానికి మనవి చేసారు. ఈ కార్యక్రమంలో కేర్ ఫుట్ బాల్ అకాడమీ అధ్యక్షులు నరాల సుధాకర్, నిజామాబాద్ ఫుట్ బాల్ అధ్యక్షులు శఖీల్, అథెటిక్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సాయిలు, జావెద్, జీవన్ రావు, సౌమ్య తల్లిదండ్రులు లక్ష్మి, గోపి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 Jan,2022 05:19PM