- ఎరువుల ధరలను తగ్గించకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం
నవతెలంగాణ డిచ్ పల్లి
కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచి రైతులను నట్టేట ముస్తుందని, ఎరువుల ధరలను తగ్గించకుంటే రైతులతో కలిసి పేద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ఇందల్ వాయి ఎంపిపి బాదవత్ రమేష్ నాయక్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చిలువెరి గంగా దాస్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మోహన్ నాయక్, డిచ్ పల్లి మండల టీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు శక్కరి కొండ కృష్ణలు అన్నారు. అదివారం ఇందల్ వాయి, డిచ్ పల్లి మండల కేంద్రలలో వేర్వేరుగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేయడానికి రైతులకు భరోసా కల్పిస్తూ కేసీఆర్ రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటూ ముందుకు నడిపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధివిధానాలు ప్రధానంగా రైతులకు రబీ సీజన్ లో, ఖరీఫ్ సీజన్ లో ఇబ్బందులను పెట్టడమే కాకుండా ఎరువుల ధరలు పెంచడం రైతులను నట్టేట ముంచే విధంగా ఉన్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శతవిధాలా రైతులకు ప్రయోజనాలు కల్పిస్తున్న సమయంలో ఒక విషపూరితమై నటువంటి నిర్ణయం తీసుకొని తెరాస ప్రభుత్వం పైన కుట్రలతో రైతుల నడ్డివిరిచే విధంగా ఎరువుల ధరలు విపరీతంగా పెంచడానికి ముందుకు రావడం రాష్ట్రరైతులు ఎప్పటికీ క్షమించరని తగిన సమయంలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని వారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటున్నదని, రైతులపై కుట్రపూరితంగా నాటి నుంచి నేటి వరకు రైతులకు నల్ల చట్టాలు తెచ్చి రైతుల్ని ఏడు నెలలుగా ఇబ్బంది పెట్టి నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకొని రైతులను మోసం చేస్తూ మళ్లీ మరోసారి తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించే పంటకు కేంద్ర ప్రభుత్వం ద్వారా గిట్టుబాటు ధరను అమలు చేయక ధాన్యం కొనుగోలు చేయలేక ఈరోజు మళ్లీ మూడోసారి రైతుల నడ్డివిరిచే విధంగా ఎరువుల ధరలు భారీగా పెంచి మళ్లీ మోసానికి పాల్పడిందని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నిలదీస్తామని ప్రశ్నిస్తూ,ఎంత దూరమైనా ప్రయాణం చేయడానికి సిద్ధమని వేంటనే పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని హెచ్చరించారు.ఈ సమావేశం లో జడ్పీటీసీ దాసరి ఇంద్ర లక్ష్మీనర్సయ్య, రైతు సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ నారాయణరెడ్డి,ఎంపిటిసి చింతల దాస్, సర్పంచులు లోలం సత్యనారాయణ, తెలు విజయ్ కుమార్, జి నరేష్, శేఖర్, గడ్కోల్ శ్రీనివాస్, పద్మారావు, ఒడ్డెం నర్సయ్య, సర్పంచులు జగదీష్, గణేష్, ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు దండుగుల సాయిలు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 Jan,2022 06:50PM