నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
జర్నలిస్ట్‌పై దాడి చేసి చంపడానికి ప్రయత్నించిన ఘటన దారుణం అని సీపీఐ నాయకులు అన్నారు. ఈ మేరకు ఆ పార్టీ ఆఫీసులో జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య , జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె రాజన్న, ఆరేపల్లి సాయిలు, ఏ.రాజేశ్వర్ రాజ్ కుమార్ విలేకర్లలతో మాట్లాడుతూ శనివారం తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాక్షి రిపోర్టర్ పోశెట్టిని తాము పరామర్శించామని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన దుండగులను కఠినంగా శిక్షించాలని ప్రజల ఆస్తులకు ప్రాణాలకు రక్షణ కల్పించలేని ప్రజాప్రతినిధులు ప్రజలపై దాడులు చేస్తున్న తన అనుచరులను అదుపులో పెట్టుకొకుండా రౌడీలుగా తయారు చేస్తూ ప్రజలను చూపుతున్నారు అని అన్నారు.
ఇలాంటి ఘటనలను తాము లెక్కచేయమని ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం తమ ప్రాణాలను సైతం పనంగాపేటీ ప్రజలకు ప్రభుత్వానికి మద్య వారధిగా ఉన్న జర్నలిస్టులను తమ దోపిడీకి దౌర్జన్యాలకు అడ్డు వస్తున్నారని, ఈ విధంగా కొట్టి చంపడానికి పూనుకున్నారు అని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రధానంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన అనుచరులను తానే బేషరతుగా పోలీస్ స్టేషన్లో అప్పచేపాలని తనపై వస్తున్న ఆరోపణలను పోగొట్టుకోవాలంటే తన అనుచరులను పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పి నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. అట్లాగే ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని జర్నలిస్టు పోశెట్టి ప్రాణానికి హాని ఉన్నందున అతనికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 Jan,2022 07:05PM