నవతెలంగాణ కంటేశ్వర్
పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు పాటించడానికి అనుకూల పరిస్థితులను, అవసరమైన సౌకర్యాలను కల్పించడం మీద దృష్టి సారించకుండా సెలవులు పొడిగించడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని టి పి టి ఎఫ్ భావిస్తుంది. దాదాపు రెండు విలువైన విద్యా సంవత్సరాలను ఇప్పటికే కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన విద్యార్థుల భవితవ్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా బడులు మూసేసి చేతులు దులుపుకోవడం క్షమించరాని నేరమే. అయినా చీకటి ఇరుకు గదుల్లో నిర్వహించే బార్లు, రెస్టారెంట్లు, పబ్బులు, సినిమా హాళ్లు, వేలాదిమంది జనాన్ని సమీకరించి రాజకీయ పార్టీలు జరుపుతున్న బహిరంగ సభలు, ర్యాలీల తో వ్యాపించని కోవిడ్, విశాలమైన వెలుతురు గదుల్లో , ఆరుబయట నిర్వహించే పాఠశాలల్లో వ్యాపిస్తుందని బంద్ చేయడం విడ్డూరంగా ఉంది. ఇందులో అంతర్యమేంటో అంతుబట్టడం లేదు. ప్రపంచంలో చాలా దేశాల్లో అత్యధిక కరోనా కేసులు నమోదైనా విద్యాసంస్థలు మాత్రం మూయడంలేదు. మన దేశంలోనూ ఒకటి, రెండు రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాలు పాఠశాలలు కొనసాగిస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరం మొదలై కేవలం నాలుగు నెలలు మాత్రమే పూర్తయింది. ఇప్పుడు ఏ ఒక్క తల్లిదండ్రులు, టీచర్లు, సంఘాలు అడగకుండానే ఏక పక్షంగా మూసివేతకు నిర్ణయించడాన్ని అన్నీ వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.పాఠశాలల్లో భౌతిక దూరాన్ని, పరిశుభ్రతను పాటించే విధంగా సరిపోను గదులను, సిబ్బందిని, సామగ్రిని సమకూర్చే బాధ్యతను తప్పించుకోవడానికి, 317 జి.ఓ. మీద సాగుతున్న ఉపాధ్యాయ ఉద్యమాన్ని నీరుగార్చడానికి అన్నింటికి మించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసే కుట్రగా భావించాల్సి వస్తుంది. ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలను వీడి, మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని టీచర్లు, తల్లిదండ్రుల కోరిక మేరకు విద్యాసంస్థలను కొనసాగించాలని టి పి టి ఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రమణ మైస శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 Jan,2022 07:14PM