నవతెలంగాణ కోడేరు
మండల పరిధిలోని ఎత్తం శివారులో గల 16 వందల అడుగుల ఎత్తు గల గట్టుపై వెలసిన రామలింగేశ్వర స్వామి దర్శనానికి సంక్రాంతి సందర్భంగా జరిగే జాతరకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు పోటెత్తారు. దీంతో భక్తుల సౌకర్యార్థం దాతలు అన్నదాన కార్యక్రమం, నీటి సౌకర్యం కల్పించి భక్తుల ఇబ్బందులను తొలగిస్తూ భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా సహాయపడడం లో దాతల సహకారం పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో దాతలు గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు నరసింహ నాయక్ మరియు తుమ్మల బాల పీరు మిత్ర బృందం మరియు మెగా అభిమానులు ఎత్తం పాషా మిత్రబృందం తదితరులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm