నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలో శనివారం సంక్రాంతి ఆదివారం కనుము పండుగ వేడుకలను మండల ప్రజలు ఘనంగా నిర్వహించారు. మహిళలు సంక్రాంతి పండుగ రోజు వేకువజామునే లేచి ముంగిళ్ళను అందంగా ముగ్గులతో అలంకరించి రంగులు అద్దారు. ముగ్గులలో గొబ్బెమ్మలను నుంచి పాటలు పాడారు. ప్రజలు యువత ఒకరినొకరు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నరు. ఆదివారం కనుమ పండుగను కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రతి ఇంటిలోనూ పెరుగుతున్న పశుసంపదను అందంగా అలంకరించి వాటికి బెల్లంతో వండిన వంటకాన్ని తినిపించారు. పిల్లలు పతంగులను పోటీలుపడి ఎగురవేశారు. గ్రామ పొలిమేరల్లో వున్న మైదానాలన్ని పతంగుల సందడి నెలకొంది.
Mon Jan 19, 2015 06:51 pm