నవతెలంగాణ-గోవిందరావుపేట
సెలవులు మరియు సంక్రాంతి పండుగ పర్యాటకులతో గత రెండు రోజులుగా లక్నవరం లో పర్యాటకుల సందడి నెలకొంది. శని ఆదివారాలు లక్నవరం పర్యాటక కేంద్రం పర్యాటకులతో కిక్కిరిసిపోయింది. రెండు రోజులు వాహనాలను పర్యాటకులను క్రమబద్దీకరించేందుకు జిల్లా ఏ ఎస్పీ తో సహా పసర ఎస్ ఐ .సి ఐ లు పోలీసులు కూడా శ్రమించాల్సి వచ్చింది అంటే పర్యాటకులు ఏ స్థాయిలో వచ్చారు అర్థం చేసుకోవాలి. మేడారం మహా జాతర సందర్శకులు కూడా పర్యాటక కేంద్రానికి పోటెత్తడంతో పర్యాటకుల వెల్లువ కనిపించింది. పర్యాటకుల కోసం లక్నవరం మేనేజ్మెంట్ అన్ని చర్యలు చేపట్టింది. లక్నవరం పర్యాటక కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రైవేటు ఈవెంట్ లన్ని పర్యాటకుల సందడితో కిటకిటలాడాయి. తెలంగాణ రాష్ట్రం నుండే గాక ఇతర రాష్ట్రాల నుండి కూడా జాతర సందర్శనార్థం వచ్చి పర్యాటక కేంద్రం లో సందడి చేశారు. ప్రైవేటు బస్సులు కార్లు ప్రతి సంవత్సరం పెరిగి పోతున్నాయని సందర్శకులు ఖర్చులకు వెనకాడకుండా హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తున్నారని స్థానికులు తెలుపుతున్నారు. పిల్లలు యువకులు ప్రధానంగా పర్యాటక కేంద్రంలో ప్రధాన సందడి గా కనిపిస్తున్నారు.
జాతరకు ముందస్తు మొక్కులు చెల్లిస్తున్న క్రమంలో ఈ పర్యాటకుల సందడి మరింత పెరిగే అవకాశం ఉందని పోలీస్ శాఖ మరియు పర్యాటక శాఖ అభిప్రాయపడుతున్నారు. గత జాతర సమయంలో కూడా పర్యాటకులు రద్దీ పెరిగి పలువురు మునిగి మృతి చెంది నందున ఈ సారి మరింత కట్టుదిట్టమైన చర్యలు ఏర్పాటు చేయాలని ప్రజాసంఘాల నాయకులు స్థానిక నాయకులు కోరుతున్నారు. అవసరమైతే ప్రైవేట్ సెక్యూరిటీ అందుబాటులో ఉంచి చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. అంతకుముందున్న సెక్యూరిటీ కరోనా కారణంగా నష్టాల పేరుతో తొలగించారని. ఇప్పుడు పర్యాటకులు పెరిగినందున తిరిగి ప్రైవేట్ సెక్యూరిటీని తీసుకోవాలని వారు కోరుతున్నరు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 Jan,2022 07:36PM