-క్యూలైన్ల ద్వారా దర్శనాలు
- మేడారంలో పోలీసుల పటిష్ట భద్రత
నవతెలంగాణ- తాడ్వాయి
ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి గిరిజన జాతర అయిన మేడారం, రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన మేడారం ఆలయానికి భక్తులు పోటెత్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరుగు మేడారం మహా జాతరకు ఇప్పటి నుండే ముందస్తుగా సందర్శకులు భారీగా తరలి వస్తున్నారు. ఆదివారం కావడంతో సరిహద్దు రాష్ట్రాలైన, చతిస్గడ్, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో సమ్మక్క-సారలమ్మ వనదేవతల దేవాలయం ఒక్కసారిగా కిటకిటలాడింది. క్యూలైన్ల ద్వారా దర్శనాలు
మేడారంలో ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య అధికంగా పెరగడంతో దేవాదాయ శాఖ అధికారులు కరోన నిబంధనల ప్రకారం క్యూలైన్ల ద్వారా దర్శనాలు చేయించారు. సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు మన దేవతల వద్దకు దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూజారులు ఎండోమెంట్ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు.
మేడారంలో పటిష్ఠ భద్రత, తప్పిపోయిన భక్తులకు బంధువులకు అప్పగింత
మేడారంలో వనదేవతల దర్శనానికి భారీగా భక్తుల సందడి పెరగడంతో తొక్కిసలాట, దొంగతనాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ములుగు జిల్లా ఎస్పీ సంఘం ఆధ్వర్యంలో
పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా వనదేవతలను దర్శించుకుని ఎవరి ఇళ్లకు వారు ప్రశాంతంగా చేరుకునే విధంగా చర్యలు చేపట్టారు. జనగం దగ్గర సిరిపురం గ్రామానికి చెందిన చిన్న పాప, అదేవిధంగా సిద్దిపేట జిల్లా ఆకునూరు గ్రామానికి చెందిన తుంగ చంద్ర అని 70 సంవత్సరాల వృద్ధుడు తప్పి పోగా ములుగు సీఐ శ్రీధర్ చొరవతో తప్పిపోయిన భక్తులను వారి బంధువులకు తల్లిదండ్రులకు అప్పగించారు. భక్తులు ములుగు సిఐ శ్రీధర్ కు ధన్యవాదాలు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 Jan,2022 07:40PM