నవతెలంగాణ చివ్వేంల
మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం తుల్జారావు పేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న, మండలాధ్యక్షుడు ధరావత్ వీరన్న నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పత్తిపాక వేణుధర్, గ్రామ శాఖ అధ్యక్షులు పత్తిపాక వెంకటేశ్వర్లు, పత్తిపాక రంగారావు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm