- మలబార్ గోల్డ్ షాపింగ్ మాల్
ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రి హరీశ్
నవ తెలంగాణ - సిద్దిపేట
అంతర్జాతీయ స్థాయి అభరణాల షాపింగ్ మాల్ సిద్ధిపేట పట్టణ ప్రజలకు అందుబాటులో రావడం సంతోషంగా ఉందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
సిద్ధిపేట పట్టణంలోని విక్టరీ టాకీస్ చౌరస్తా లో మలబార్ గోల్డ్ షాపింగ్ మాల్ ను శనివారం ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ షాపింగ్ మాల్ లో వివాహా ఆభరణాల కొనుగోళ్ళకు ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయని, న్యాయమైన ధరలకే నగలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి షాపింగ్ చేసి మంత్రి, ఎమ్మెల్సీ చేతుల మీదుగా వినియోగదారులకు ఆభరణాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరామ్, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.