నవతెలంగాణ నవిపేట్:
ఎమ్మెల్యే దంపతుల పెళ్లి రోజు సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ ఆమేర్ దంపతులు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ రక్తదాన శిబిరంలో 100 యూనిట్లను రెడ్క్రాస్ సొసైటీకి అందించినట్లు సొసైటీ చైర్మన్ మహమ్మద్ మోయీజోద్దీన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మువ్వ నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, వైస్ ఎంపీపీ హరీష్, బుచ్చన్న, లోకం నర్సయ్య, మహాంతం సర్పంచ్ రాజేశ్వర్, ఉప సర్పంచ్ మల్లేష్, రాజు, సతీష్, అర్షద్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm