- వాహనానికి సంబంధించిన ధ్రువ పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలి
- నియమ నిబంధనలను తూచా తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించాలి
- నిజామాబాద్ ట్రాఫిక్ చందర్ రాథోడ్
నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని నిజామాబాద్ ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రజలతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు వాహనదారులకు తెలియజేశారు. ఈ మేరకు సోమవారం
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ కమిషనర్ కె ఆర్ నాగరాజు ఆదేశాల మేరకు నిజామాబాద్ ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్, ఎస్ ఐ లు ప్రదీప్ శంకర్ ల ఆధ్వర్యంలో నగరంలోని కంటేశ్వర్ ప్రాంతంలో గల మీసేవ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. వాహన పత్రాలు, నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న వాహనదారులు, మాస్కులు లేకుండా నడుపుతున్న వాహనదారుల ను అపి నిజామాబాద్ ట్రాఫిక్ ఏసిపి ప్రభాకర్ వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ తనిఖీల్లో భాగంగా సుమారు 30 మంది వాహనదారులు వాహనానికి నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని, మాస్కులు లేకుండా నడుపుతున్న వాహనదారులను అలాగే వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలు లేని వాహనాలను, హెల్మెట్ లేకుండా నడుపుతున్న వాహనాలను పట్టుకొని వారి వివరాలను క్షుణ్నంగా తెలుసుకొని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరిమానాలు విధించారు. అనంతరం వాహనాలను సంబంధిత పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఎట్టి పరిస్థితులలో వాహనానికి బండి నంబర్ ఉంచాలని లేనియెడల చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే ప్రతి వాహనదారుడు కూడా హెల్మెట్ ధరించాలని మా స్కూలు కూడా ధరించాలని లేనియెడల ప్రభుత్వం ఆదేశాల ప్రకారం జరిమానా విధించడం జరుగుతుందని వాహనదారులకు పలు సూచనలు చేశారు. మొత్తంగా 30 మందికి పోలీస్ నియమ నిబంధనల ప్రకారం జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ తెలియజేశారు. ప్రతి ఒక్క వాహనదారుడు నెంబర్ ప్లేట్ ను తప్పనిసరిగా వాహనానికి ఉంచాలని లేనియెడల నియమ నిబంధనల ప్రకారం వాహనాలకు జరిమానాలతో పాటు కమిషనరేట్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 17 Jan,2022 04:38PM