- లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు ధరావత్ బాలు నాయక్
నవ తెలంగాణ చివ్వేంల:
తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ పేరుతో సెలవులను ప్రకటించి, ఆ సెలవులను కరోన పేరుతో పొడిగించడం పేద, బడుగు,బలహీన, వర్గాల విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేయడమేనని, ఇప్పటికే గత 22 నెలలుగా కరోన మూలంగా విధించిన లాక్ డౌన్తో విద్యార్థులకు తీరని నష్టం జరిగిందని, తిరిగి ఇప్పుడు సెలవులు పొడిగిస్తే మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉందని, విద్యాసంస్థలనుప్రారంభిస్తేనే కరోనా వస్తుందా అని , లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు ధరావత్ బాలు నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం కరోన పేరుతో విద్యాసంస్థలను మూసివేయడం విడ్డూరంగా ఉందని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వేలాదిమందితో నిర్వహించే సభలకు, రైతు బంధు సంబరాలకు , రాజకీయ సభలకు, సినిమాహాళ్ల కు, హోటల్, రెస్టారెంట్, బార్ షాపులలో గుంపులు గుంపులు జనం సంచరిస్తున్నా రాని కరోన విద్యా సంస్థలకు వస్తుందని ప్రభుత్వం ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. సెలవు ప్రకటించడం మూలంగా కార్పొరేట్ విద్యాసంస్థలకు మేలు జరుగుతుంది తప్ప,పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు న్యాయం జరగదని పేర్కొన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల అడుగులకు మడుగులు ఒత్తుతూ ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలిపారు. ప్రభుత్వo విద్యారంగానికి పాడే కట్టి, కార్పొరేట్ విద్యాసంస్థలను పల్లకిలో మోస్తుందని ప్రభుత్వం వెంటనే కరోన నిబంధనలు పాటిస్తూ, తగు జాగ్రత్తలు తీసుకుంటూ, విద్యా సంస్థలను నడపాలని, పేద,బడుగు,బలహీన వర్గాల విద్యార్థులకు విద్యను అందుబాటులో ఉంచాలన్నారు. విద్యార్థులందరికీ ప్రభుత్వమే రెగ్యులర్ గా ఉచితంగా శానిటైజర్, మాస్కులు పంపిణీ చేసి విద్యా సంస్థలను నడపాలని కోరారు, విద్యా సంస్థలలో ప్రతిరోజు పరిశుభ్రత పాటించాలని, తరగతి గదులను శానిటైజర్ చేయాలని, ప్రభుత్వానికి సూచించారు, ప్రభుత్వం విద్యాసంస్థల సెలవులు పొడిగింపు ఉపసంహరించుకొని తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 17 Jan,2022 05:03PM