నవతెలంగాణ కంటేశ్వర్
రెవెన్యూ అధికారుల తప్పిదాలు బాధితుల ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. పెద్ద ఎత్తున మామూలు పుచ్చుకొని రికార్డులను తారుమారు చేసి బాధితులకు అన్యాయం చేస్తున్నారు. ఈ తరహాలో జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. భూముల రికార్డుల తారుమారు, కబ్జాలు తదితర వివాదాలపై ప్రజావాణిలో ఫిర్యాదులు పెరిగిపోయాయి. ఇందులో భాగంగానే బోధన్ మండలం ఆచన్ పల్లి గ్రామానికి చెందిన దంపతుల ఆత్మహత్యాయత్నం కలెక్టరేట్ లో సంచలనం సృష్టించింది.
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో జరిగే ప్రజావాణిలో పిర్యాదు చేయడానికి వచ్చిన ఓ కుటుంబం ఆత్మహత్య యత్నంకు పాల్పడిన సంఘటన కలకలం రేపింది. సోమవారం కలెక్టర్ ఫిర్యాదులు స్వీకరిస్తుండగా ఈ ఘటన జరిగింది. బోధన్ మండలం లోని ఆచన్ పల్లికి చెందిన దర్శనం బంధయ్య, దర్శనం రాణిలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉన్న పోలీసులు, స్థానికులు వారిని అడ్డుకున్నారు. దంపతుల ఆత్మహత్యాయత్నం ను పోలీసులు అడ్డుకుని వారి ప్రాణాలను కాపాడారు. ఈ సందర్భంగా బాధితులు ఆవేదనతో వారి మనోవేదనను వెలిబుచ్చారు.తాము పాండుతర్పాలో 30 ఏళ్ళ క్రితం రెండు ఎకరాల భూమి కొనుగోలు చేసి సాగు చేసుకుంటన్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన కొత్త పట్టాల పై భూమి విక్రయించిన వారి పేర్ల మీద రావడంతో వారు కబ్జా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సర్పంచ్ కుటుంబం తమపై దాడులు చేస్తూ, తాము పండించిన పంటను దౌర్జన్యంగా కోసుకుపోతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై రెవెన్యూ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారుల కారణంగా తమ భూమిపై హక్కు లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 17 Jan,2022 05:29PM