- ఎనిమిది ద్విచక్ర వాహనాలు, రెండుఆటోల స్వాధీనం .
- వివరాలు వెల్లడించిన సీపీ కే .ఆర్. నాగరాజు
నవతెలంగాణ కంటేశ్వర్
వివిధ ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీ పీ కే.ఆర్. నాగరాజు తెలిపారు. ఈ మేరకు సోమవారం సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఉమ్మడి జిల్లా తో పాటు నిర్మల్ జిల్లాలో వాహనాల దొంగతనానికి ముఠా సభ్యులు పాల్పడుతున్నారన్నారు. నాల్గవ టౌన్ పోలీసులు నగరంలోని బొర్గం వంతెన వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకొని విచారించమని తెలిపారు. చోరీ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్ కాలనీ కి చెందిన షేక్ ముజాహిద్ షేక్ ,షేక్ జమిల్, మహారాష్ట్ర లోని హిమాయత్ నగర్ కు చెందిన షేక్ మతిన్ ముగ్గురు సభ్యులు ముఠాగా ఏర్పడి పార్కింగ్ చేసి ఉన్న ఆటోలు, ద్విచక్ర వాహనాలు తాళం తీసి చోరికిపాల్పడ్డారన్నారు.
నగరానికి చెందిన ఆటోడ్రైవర్ రాపర్తి రాజు ఫిర్యాదు మేరకు కేసు విచారణ చేపట్టనున్నారు. దర్యాప్తులో భాగంగా ముగ్గురు సభ్యుల ముఠా నుంచి వివిధ ప్రాంతాల్లో చోరీ చేసిన ఎనిమిది మోటార్ సైకిల్లు, రెండు ఆటోలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. వాహనాల చోరీ జరిగిన ఆయా ప్రాంతాల్లో వాహనదారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. మొత్తం పది కేసులు దొంగతనం పై నమోదయ్యాయన్నారు. సుమారు నాలుగు లక్షల నలభై వేల రూపాయలు విలువగల మోటార్ సైకిల్, ఆటోలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.ఈ కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించి దొంగలను పట్టుకున్న సీ సీఎస్ సిఐలు శ్రీహరి, మురళి కృష్ణ, పట్టణ సీఐ సత్యనారాయణ, నాల్గవ టౌన్ ఎస్ఐ సందీప్, సీ సీఎస్ ఎస్ ఐ వెంకటయ్య,సిబ్బంది సురేష్,సుభాష్, నరేష్, శంకర్, నీలేష్, కాశయ్య, బాలకిషన్ లను సీపీ అభినందించారు.సిబ్బందికి రివార్డులు అందజేశారు. ఈ సమావేశంలో లో అదనపు డీసీపీ అరవింద్ బాబు, ఏసీపీ వెంకటేశ్వర్, సీసీఎస్ సీఐ లు శ్రీ హరి ,కృష్ణ పట్టణ సీఐ సత్యనారాయణ నాల్గవ టౌన్ ఎస్ఐ సందీప్, సీ సీ ఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 17 Jan,2022 05:36PM