- ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ-గోవిందరావుపేట
టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఆధారంగా ఉంటుందని ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి అన్నారు.
సోమవారం మండలంలోని పసర, చల్వాయి గ్రామాల్లో ప్రమాద బీమా చెక్కుల పంపిణీ కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సూరపనేని సాయి కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డితో పాటు జడ్పిటిసి తుమ్మల హరిబాబు పార్టీ మండల ఇన్చార్జి పోరిక గోవింద నాయక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం పార్టీ ఎదుగుదల కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలను పార్టీ విస్మరించిందని ఆదుకుంటుందని వారన్నారు. కార్యకర్త మరణించిన వారి కుటుంబానికి ఆర్థిక అండదండా అందించడానికి సభ్యత్వం తోపాటు బీమా సౌకర్యాన్ని కల్పించిందని వారన్నారు. దీనిలో భాగంగా చల్వాయి గ్రామానికి చెందిన చుక్కయ్య, గ్రామానికి చెందిన చిలకపాటి రాజా కుటుంబానికి ఒక్కోక్కరికి రెండు లక్షల రూపాయల చెక్కులను అందిస్తున్నట్లు వారు తెలిపారు. చుక్కయ్య భార్య బీమికి రెండు లక్షల రూపాయలు. చిలకపాటి రాజా భార్య రాణికి రెండు లక్షల రూపాయల చెక్కులను నేడు అందించడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో కూడా కార్యకర్తలకు కార్యకర్తలకు కుటుంబాలకు ప్రమాద బాధితులకు పార్టీ తరఫున మరిన్ని మెరుగైన అవకాశాలను కల్పించేందుకు పార్టీ సన్నద్ధం చేస్తున్నట్లు వారు తెలిపారు. కార్యకర్తలకు ముందు ముందు మరిన్ని మంచి రోజులు వస్తాయని వారన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి లకావత్ నర్సింహ నాయక్, సోషల్ మీడియా నియోజకవర్గ ఇంచార్జి నెమలి బాలకృష్ణ, మండల అధికార ప్రతినిధి భూ రెడ్డి మధు, చల్వాయి సర్పంచ్ ఈసం సమ్మయ్య, ఎంపీటీసీ వెలిశాల స్వరూప, లవుడియా రామచందర్ నాయక్, సింగిల్ విండో డైరెక్టర్ కోమటిరెడ్డి సమ్మిరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు వరదం చందర్ రాజు, చుక్క గట్టయ్య, రేండ్ల శ్రీనివాస్, సీనియర్ నాయకులు బూర సురేందర్ గౌడ్,తలసిల ప్రసాద్, సంసొత్ రాజన్న నాయక్, అజ్మీర చందూలాల్, పసర టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు తాటికొండ శ్రీనివాస్ చారి, గ్రామ యూత్ అధ్యక్షుడు చుంచు యాకోబ్, మాజీ సర్పంచ్ తాటి రమణ, రేండ్ల సంతోష్, నాం పూర్ణయ్య, చెవుల రవి, మేడిపల్లి మహేందర్, నాం దేవి రెడ్డి, బైకాని ఓదెల్, కంకనాల కనకయ్య, జూన్, ఏనుగుల సాంబశివరావు, బొడిగే రఘు, కుమ్మరి వెంకన్న, శ్యామల సమ్మిరెడ్డి, సామ వెంకట్ రెడ్డి, ఎల్లవుల శేఖర్, ధరావత్ పూర్ణ, ముక్కల కుమార్, ఉటుకూరి వెంకటరామయ్య, పసుల భద్రయ్య, గడ్డం సారయ్య తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 17 Jan,2022 05:50PM