- టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి కొర్రా రఘురాం
నవతెలంగాణ-గోవిందరావుపేట
కరోనా సాగుతో సంక్రాంతి సెలవులను ఈనెల 30 వరకు పొడిగించడం దురదృష్టకరమని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ( టీఎస్ యుటిఎఫ్) మండల ప్రధాన కార్యదర్శి కోర్రా రఘురాం అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఆయన నవతెలంగాణ తో మాట్లాడారు.వివాహాలు,ఫంక్షన్లు రాజకీయ పార్టీ మీటింగ్ లు,జాతరలు శుభాకార్యాలు విందువినోదాలు నిరంతరంగా జరుగుతుండగా కరోణ బూచి చూయించి విద్యాసంస్థలను మూసి వేయించడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. గత రెండు సంవత్సరాలుగా విద్యార్థినీ విద్యార్థులు పాఠశాలకు దూరమై అటు తల్లిదండ్రులకు భారమై ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో విద్యార్థినీ విద్యార్థులకు పాఠశాల దూరం చేయడం సమంజసం కాదు.కరోనా నియమాలు పాటిస్తూ, ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడం సమంజసం కాదన్నారు.బడులను బందు చేయడమే బంగారు తెలంగాణ అవుతుందా? పాఠశాలల్లో కనీస వసతులు కల్పించకుండా 317 జీవోను తీసుకోవచ్చి అరడజను మంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల ప్రాణాలను బలి కొనడం జరిగింది. ఇటు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని నిలదీస్తా రానే ఉద్దేశంతో పాఠశాల సెలవులను ఈనెల 30 వరకూ పొడిగించినట్లు గా ప్రజలు పరిష్కరిస్తుందని ఆయన అన్నారు. కరోనాతో కోలుకోలేని స్థితిలో ఉన్న విద్యా వ్యవస్థను ప్రభుత్వమే పెట్టాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 17 Jan,2022 05:55PM