- వర్ధంతి సందర్భంగా నివాళి
నవతెలంగాణ కంటేశ్వర్
జ్యోతిబసు 12వ వర్ధంతి సందర్భంగా సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు సోమవారం అర్పించారు. అనంతరం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ.. భారతదేశంలో మార్క్సిజం సిద్ధాంతాన్ని ఆచరణలో అమలు జరిపి మతోన్మాద శక్తులకు, ఫాసిస్టు విధానాలకు దీటైన సమాధానం చెప్పి 30 సంవత్సరాల పాటు ఏకధాటిగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగి ఎటువంటి విమర్శలకు తావులేకుండా పరిపాలించిన వ్యక్తి సమాజానికి ఒక మార్గదర్శకం కామ్రేడ్ జ్యోతిబసు నిరూపించారని ఆయన అన్నారు. ప్రజల చేతుల్లో భూమి ఉంటే భూస్వాములకు పెట్టుబడిదారులకు లొంగకుండా తమ కాళ్ళపై తాము నిలబడేలా కలుగుతారని భావించి 16 లక్షల ఎకరాలు భూమిని పేదలకు పంచి దున్నేవాడిదే భూమి అనే నినాదాన్ని నిరూపించిన వ్యక్తి అని ఆయన అన్నారు నేటితరం బూర్జువా పార్టీల నాయకులు ఒకసారి అధికారంలోకొస్తే తమ తర తరాలు హాయిగా బతకడానికి కావలసిన సంపదను కూడా పెడుతున్నారు అని, అవినీతికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వకుండా స్వచ్ఛమైన పరిపాలనను అందించిన వ్యక్తి జ్యోతి బసు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకట్ రాములు, నూర్జహాన్, సబ్బని లత, పి వెంకటేష్, ఎం. గోవర్ధన్, జిల్లా కమిటీ సభ్యులు వై గంగాధర్, కే గంగాధర్, జై గంగాధర్, జిల్లా నాయకులు లింగం ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి సిర్ప లింగం తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 17 Jan,2022 05:57PM