- ఐసిడిఎస్ జిల్లా ప్రాజెక్టు అధికారి సూపరిండెంట్ కు వినతి
నవతెలంగాణ కంటేశ్వర్
విద్యా సంస్థలకు ఇచ్చినట్లుగానే అంగన్వాడీ కేంద్రాలకు కరోనా సెలవులు ఇవ్వాలని, కరోనా తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థల నీటికీ ఈనెల 30 వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే చిన్న పిల్లలకు ఉండే అంగన్వాడీ కేంద్రాలకు మాత్రం సెలవులు ప్రకటించకపోవడం అన్యాయమని కరోణ తీవ్రత దృష్ట్యా అంగన్వాడీ కేంద్రాలకు కూడా సెలవులను ఈనెల 30 వరకు ఇవ్వాలని కోరుతూ ఐసిడిఎస్ జిల్లా ప్రాజెక్టు అధికారి సూపరిండెంట్ కి వినతి పత్రం సోమవారం అందజేశారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి స్వర్ణ నిజాంబాద్ ప్రాజెక్టు నాయకురాలు సరిత, జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ రమేష్ బాబు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm