- వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్
నవతెలంగాణ-మంథని:
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల సాక్షి రిపోర్టర్ కమలాపురం పోశెట్టి పై ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనుచరులు దాడి చేసి చంపడానికి ప్రయత్నించినా దుండగులను కఠినంగా శిక్షించాలని, దీనిని ప్రోత్సహించినా ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కూడా చట్టపరంగా శిక్షించాలని వ్యవసాయ కార్మిక సంఘం పెద్దపల్లి జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ జిల్లా ఉపాధ్యక్షులు బాపు రవిలు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక పత్రికా విలేకరులపైదాడులు, పెరిగిపోతున్నాయని, విలేకరుల పై అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు.పత్రిక విలేఖరిపై దాడి పత్రికా స్వేచ్ఛపై దాడి చేసినట్లేనని వారు అన్నారు.
వివిధ సంస్థలలో జరుగుతున్న అవినీతి అక్రమాలను,ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న విలేకరులపై దాడి చేయడం అప్రజాస్వామికమని అన్నారు. నిజామాబాదులోనిసొసైటీలో జరుగుతున్న అక్రమాలను వెలుగులోకి తెచ్చినందుకే సాక్షి విలేకరునుచంపడానికి ప్రయత్నించారన్నారు. నిజాలను నిర్భయంగా, అక్రమాలను వెలుగులోకి తెచ్చే విలేకరులపై ఇలాంటి దాడులకు పాల్పడడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి పత్రికా స్వేచ్ఛను కాపాడుతూ, పత్రిక విలేకరులకు రక్షణ కల్పించాలని ఈ సంఘటనకు బాధ్యులైనఎమ్మెల్యే జీవన్ రెడ్డితో పాటు అతని అనుచరులపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వారుడిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 17 Jan,2022 06:15PM