నవతెలంగాణ-మంథని
మంథనిలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు, భయాందోళనకు గురవుతున్నారు. సోమవారం మంథనిలో 70 మందికి వైద్య సిబ్బంది కరోన టెస్టులు నిర్వహించగా, అందులో 18మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఓ కార్యాలయంలో ఇటీవల నిర్వహించిన సమావేశం కారణంగా పలువురు ఉద్యోగులకు పాజిటివ్ వచ్చిందని, దీంతో ప్రజాప్రతినిధులు, సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. రోజువారీగా నమోదు అవుతున్న కేసుల సంఖ్య కారణంగా జనాలు జర జాగ్రత్తగా ఉండాలనిసంబంధిత అధికారులు కోరుతున్నారు.రోజురోజుకు కరోన పాజిటివ్ ల సంఖ్య పెరుగుతుండడంతో ఎప్పుడు ఏ గ్రామంలో కరోన పాజిటివ్ వస్తుందోనని ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ఆందోళనకు గురవుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm