నవతెలంగాణ-మంథని
మంథని మండలం నాగారం గ్రామ పంచాయతీ పరిధిలో రైతు వేదిక భవనంలో సోమవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సుజయ్ కుమార్ ఆదేశాలతో నాగారం గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న భూ సమస్యల పరిష్కారం కొరకు మంథని మండల తహశీల్దార్ బండి ప్రకాష్ నాగారం రైతు వేదిక భవనంలో మీసేవ సెంటర్ ను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన గ్రామ సర్పంచ్ బూడిద మల్లేష్ మాట్లాడుతూ గ్రామంలో భూ సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.మీసేవ సెంటర్ వారం రోజుల పాటు ఇక్కడే ఏర్పాటు చేస్తున్నారని ఆయన తెలిపారు. గ్రామ ప్రజలు తమ భూ సమస్యలను మీ సేవలో నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు. నాగారం భూ సమస్యలపై ప్రత్యేక చొరవ చూపించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సుజయ్ కుమార్,మంథని ఆర్డిఓ, తహసశీల్దార్ లకు ప్రత్యేక సర్పంచ్ బూడిద మల్లేష్ కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలో మంథని రెవెన్యూ ఇన్స్పెక్టర్ అమృత్ కుమార్, రెవెన్యూ సిబ్బంది, నాగారం గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు,గ్రామ రైతులు, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 17 Jan,2022 06:23PM