నవతెలంగాణ డిచ్ పల్లి
తెలంగాణ విశ్వవిద్యాలయంలో గల జాతీయ సేవా పథకం (ఎన్ ఎస్ ఎస్) కో - ఆర్డినేటర్ గా అప్లైడ్ ఎకనామిక్స్ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్, తెలంగాణ విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులు డాక్టర్. కె రవీందర్ రెడ్డి నియమితులయ్యారు.
ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ఆదేశానుసారం రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్ ఎన్ ఎస్ ఎస్ కో - ఆర్డినేటర్ నియామక ఉత్తర్వును జారీ చేశారు. సోమవారం వైస్ చాన్సలర్ చాంబర్ లో ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ చేతుల మీదుగా ఈ నియామక పత్రాన్ని అందుకున్నారు. డాక్టర్. కె. రవీందర్ రెడ్ది ఇది వరకు 5 పర్యాయాలు ఎన్ ఎస్ ఎస్ యూనిట్ - 1 కు ప్రోగ్రాం ఆఫీసర్ గా నియమితులై సమర్దవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. అత్యంత సాహస శిక్షణా శిబిరం కోసం హిమాచల్ ప్రదేశ్ లోని "కులు మనాలి"ని ఎంపిక చేసుకొని 2014 సెప్టెంబర్ లో తెలంగాణ నుంచి అన్ని విశ్వవిద్యాలయాలలోని ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లను ఎంపిక చేసుకొని తీసుకొని వెళ్లారు. గడ్డ కట్టుకొని పోయే చలిలో సైతం వాలంటీర్ల సాహస విన్యాసాలు నాడు అబ్బుర పరిచాయి. ఈ కులు మలాలి క్యాంప్ తో తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఆయన మంచి పేరుప్రతిష్టలను సాధించిపెట్టారు. అదే విధంగా విశాఖపట్టణంలో నిర్వహించిన ఎన్ ఎస్ ఎస్ ఇ టి టి (ETT Programme) శిక్షణా కార్యశాలలో పాల్గొన్నారు. యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్ గా ఎన్ ఎస్ ఎస్ వాలంటీరుల ప్రతిభను, సృజనాత్మక శక్తిని వెలికితీసి, అత్యంత ప్రోత్సాహాన్ని అందించి వివిధ జాతీయ, రాష్ట్ర, డివిజినల్ స్థాయి పోటీల్లో పాల్గొనే విధంగా కృషిచేశారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు కూడా ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్ గా రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీలలో ప్రథమ బహుమతులను సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. రవీందర్ రెడ్డి తెలంగాణ విశ్వవిద్యాలయాల వసతి గృహాలకు చీఫ్ వార్డెన్ గా, బాలుర వసతి గృహానికి వార్డెన్ గా, పీజీ అడ్మిషన్స్ కార్యాలయానికి కు డైరెక్టర్ గా, స్టుడెంట్స్ అఫైర్స్ విభాగానికి కో - ఆర్డినేటర్ గా, అప్లైడ్ ఎకనామిక్స్ విభాగానికి విభాగాధిపతిగా, బిఓస్ చైర్మన్ గా వివిధ అడ్మినిస్ట్రేషన్ & అకడమిక్ పదవీ బాధ్యతలను నిర్వర్తించారు. ప్రస్తుతం ఇంఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ గా వ్యవహరిస్తునారు. తనపై అత్యంత నమ్మకంతో ఎన్ ఎస్ ఎస్ కో - ఆర్డినేటర్ గా నియమించినందుకు ఉపకులపతి, రిజిస్ట్రార్ లకు ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్. కె. రవీందర్ రెడ్డి ఎన్ ఎస్ ఎస్ కో- ఆర్డినేటర్ గా నియమింపబడడం పట్ల పలువురు అధ్యాపకులు, అధ్యాపకేతరులు, పరిశోధకులు, విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 17 Jan,2022 06:28PM