నవతెలంగాణ డిచ్ పల్లి
తెలంగాణ విశ్వవిద్యాలయంలోని సారంగ పూర్ క్యాంపస్ కళాశాలకు చెందిన ఎం.ఎడ్. రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలు ఈ నెల 27 నుంచి జరుగవలసి ఉండగా కోవిద్ - 19 నిబంధనలను అనుసరించి వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం.అరుణ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని ఆమె అన్నారు. ఈ విషయాన్ని సారంగపూర్ క్యాంపస్ కళాశాలల విద్యార్థులు గమనించాలని ఆమె కోరారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటి వెబ్ సైట్ www.telanganauniversity.ac.in ను సందర్శించాలని ఆమె సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm