నవతెలంగాణ డిచ్ పల్లి
నిజామాబాద్ రూరల్ నీయోజకవర్గంలోని మోపాల్ మండలం నార్సింగ్ పల్లి లో గల ఇందూరు తిరుమలగా పేరు గాంచిన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి దేవస్థానానికి చెందిన 2022 కాలమానం (క్యాలెండర్) ను తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ తన చాంబర్ లో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ మాట్లాడుతూ ఈ క్యాలెండర్ లో దేవాలయానికి సంబంధించిన చరిత్ర, శ్రీ వేంకటేశ్వరస్వామి పుట్టు పూర్వోత్తరాలు, వివిధ విశేష సందర్భాలలో నిర్వహించే క్రతువులు, అర్చనలు, పూజలు, శ్రీ విశిష్టాదైత సిద్ధాంతానుసరిణీయంగా సంప్రోక్షణ వంటి విశేషాంశాలు ప్రచురించబడ్డాయని అన్నారు. ఇందూరు తిరుమల ఆలయానికి వచ్చే భక్తులు ఈ క్యాలెండర్ లో పొందుపర్చబడిన వివిధ తిథి, వార, నక్షత్ర, యోగఫలాలను సులభంగా గ్రహించి వివిధ విశేష దినాలలో దేవుడికి పూజలు నిర్వహించవచ్చని పేర్కొన్నారు. తాను కూడా ఇందూరు తిరుమల దేవాలయాన్ని అనేక పర్యాయాలు దర్శించుకొని శ్రీవారి ఏకాంత సేవలో పాల్గొన్నానని తెలిపారు. దేవాలయ పరిసర ప్రాంతమంతా ప్రకృతి వ్యవసాయంతో కలకలలాడుతుందని అన్నారు. అందుకు ఆలయ ధర్మకర్త నర్సింహారెడ్డి కృషి అమోఘం అని ప్రశంసించారు. ఇందూరు తిరుమల భక్తుల అభీష్టాలను నెరవేరుస్తూ ఇందూరు ప్రజల కొంగుబంగారంగా విలసిల్లుతుందని పేర్కొన్నారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో ఆలయ సేవకులు నరాల సుధాకర్, రవీందర్ యాదవ్, నర్సారెడ్డి, బాలకృష్ణ తదితరులు ఉన్నారు. తదనంతరం ఇటీవల ఇందూరు తిరుమలలో నిర్వహించిన వైకుంఠ ఏకాదశి ఉత్సవం, గోదాదేవి కళ్యాణానికి చెందిన ప్రసాదాన్ని ఉపకులపతి ఆచార్య. డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్ లను ప్రసాదాన్ని అందించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 17 Jan,2022 07:14PM