- సమ్మక్క పూజారి సిద్దబోయిన పాపారావు అధికారులకు వేడుకోలు
నవతెలంగాణ- తాడ్వాయి
మేడారంలోని గద్దెల సమీపంలోగల మూడో సర్వే నెంబర్ గల నా సొంత భూమిని ఐటిడిఎ (ట్రైబల్ వెల్ఫేర్), ఎండోమెంట్ అధికారులు జాతర అభివృద్ధి పేరుతో అక్రమ కట్టడాలు నిర్మాణాలు నిర్మిస్తున్నారని, ఉన్నత అధికారులు దీనిని పరిశీలించి నా భూమి నాకు చెందేలా చూడాలని కోరారు. సోమవారం విలేకరులతో మాట్లాడారు.. గద్దెల వెనకాల ఉన్న నా భూమిలో గతంలో కొన్ని నిర్మాణాలు చేపట్టారని, మళ్లీ ఇంకా కొన్ని నిర్మాణాలు నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన చెందారు. మా తాతల, ముత్తాతలు సంపాదించిన ఈ భూమి, మిగతా వారికి కూడా ఉందని వారి భూమి మాత్రం అధికారులు వదిలేసి, కక్షగట్టి నా భూమిలోనే అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నారని మనో వేదన చెందారు. ఆదివాసీ గిరిజన నైనా నేను కడు పేద వాడిని అని, సంబంధిత ఉన్నత అధికారులు సదరు భూమిని పరిశీలించి నా భూమి నాకు చెందేలా నాకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. లేదంటే నా భార్య గతంలోనే చనిపోయిందని, చిన్న పిల్లలతో నేను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యే శరణ్యమని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 17 Jan,2022 08:13PM