నవతెలంగాణ- తాడ్వాయి
తాడ్వాయి మండల నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా మండల కేంద్రానికి చెందిన చింతల దేవేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చింతల దేవేందర్ మాట్లాడుతూ.. మండలంలోని జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విలేకరులు తిరువాయిముడి పురుషోత్తం, తమల సమ్మయ్య గౌడ్, సారయ్య, ప్రతాప్, శ్రీకాంత్ రెడ్డి తదితర మండల జర్నలిస్టులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm