- తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్
ఈరోజు ముఖ్యమంత్రి కేసిఆర్ గారి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు చదువుకుంటున్న ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంగ్లీష్ మీడియం బోధన చేయాలని గోప్ప నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసి తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటికే దాదాపు వెయ్యి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన ఉచిత ఇంగ్లీష్ మీడియం విద్యను అందించడం జరుగుతుందని.
అంతటితో ఆగకుండా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన చేయాలని నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరమని తెలిపారు.
మారుతున్న ప్రస్తుతం పరిస్థితుల ప్రకారం ఇంగ్లీష్ మీడియం ద్వారానే ఈ పేద బడుగు బలహీన వర్గాలు తమ కాళ్లపై తాము నిలబడతారు అనే ఉద్దేశంతో ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ. 7289 కోట్లతో మన ఊరు ఉ మన బడి ప్రణాళికతో ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలని నిర్ణయించడం జరిగింది అని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 17 Jan,2022 09:13PM