- క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ తో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
నవతెలంగాణ కంటేశ్వర్
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బొర్లం గ్రామంలో జాతిపీత మహాత్మా గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.విగ్రహంతో పాటు సిసి కెమెరాలు ద్వంసం చేశారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు 30 సంవత్సరాల క్రితం గ్రామస్థులు డబ్బులు జమ చేసి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు గ్రామస్థులు తెలిపారు. అప్పటి నుండి ఇప్పటి వరకు గాంధీ జయంతి పండుగ వాతావరణంలో చేసుకుంటామన్నారు. ఇప్పటివరకు తమ గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడం లేదని ఇది జరగడం చాలా దారుణం అన్నారు. ఈ ఘటనకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని వారు పోలీసులను కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm