- సీఎం కేసీఆర్ కు అర్సాపల్లి వివేక్ పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రుల పోస్ట్ కార్డ్ వినతి
నవతెలంగాణ కంటేశ్వర్
పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పాఠశాలలను తెరవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన అర్సపల్లి వివేక్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పోస్ట్ కార్డుల ద్వారా వినవించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ.. స్వచ్ఛందంగా తాము ముందుకు వచ్చి పిల్లల భవిష్యత్తు దృష్ట్యా తిరిగి పాఠశాలలను పునః ప్రారంభించాలని పోస్ట్ కార్డు ద్వారా కోరుతున్నామని తెలిపారు. గడిచిన రెండేళ్లలో పిల్లలు ఎంతగా నష్టపోయారనేది పాఠశా యాజమాన్యంతో పాటు తల్లిదండ్రులు వారి ఆవేదనను వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm