- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు
నవతెలంగాణ కంటేశ్వర్
సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం నిజామాబాద్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలు రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ గ్రామంలో జరుగనున్నాయని తెలిపారు. 22వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు మహాసభలు పురస్కరించుకొని రాష్ట్ర ఆన్ లైన్ బహిరంగ సభ జరుగుతుందని దీనికి పార్టీ ఆలిండియా కార్యదర్శి సీతారం ఏచూరి, పోలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, బృందాకరత్, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు ప్రసంగిస్తారని తెలిపారు. ఈ బహిరంగ సభను జిల్లాలోని ప్రజానీకం వామపక్ష శ్రేయోభిలాషులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జనవరి 23 నుంచి 25 వరకు తుర్కయాంజల్ లో ప్రతినిధులతో మహాసభ నిర్వహించడం జరుగుతుందని గత నాలుగు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో జరిగిన ప్రజా ఉద్యమాలను సమీక్షించుకొని దేశంలో ముంచుకొస్తున్న మతోన్మాద ప్రమాదాన్ని ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమ కార్యాచరణను ఈ మహాసభలు చర్చించి నిర్ణయించడం జరుగుతుందని ఈ మహాసభ జిల్లా పార్టీ కార్యకర్తలు జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, సబ్బని లత, పి వెంకటేష్, ఎం గోవర్ధన్, జిల్లా కమిటీ సభ్యులు వై గంగాధర్ ,జంగం గంగాధర్ ,కొండ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 18 Jan,2022 05:29PM