- డాక్టర్ ఆలోక్ రాజ్ భట్ ను అభినందించిన వీసీ
నవతెలంగాణ డిచ్ పల్లి
తెలంగాణ విశ్వవిద్యాలయానికి చెందిన ఎం.బి.ఎ. పూర్వ విద్యార్థి & పూర్వ పరిశోధకుడు డా. ఆలోక్ రాజ్ భట్ కు ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సైన్స్ ఆఫ్ రీసర్చ్ (ఐ సి ఎస్ ఎస్ ఆర్) (ICSSR) సంస్థలో పోస్ట్ డాక్టరల్ ఫెల్లో గా ప్రవేశం లభించింది. ఎం.బి.ఎ. విభాగపు ప్రొఫెసర్ డా. కైసర్ మహ్మద్ పర్యవేక్షణలో "ఇంపాక్ట్ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్, ఫైనాన్సింగ్, డివిడెంట్ డిసిషన్ ఆన్ ద సాల్వెన్సి ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ డ్రగ్ సెక్టార్" అనే అంశంపై పి డి ఎఫ్ పరిశోధన చేయబోతున్నారు. రెండేండ్ల పాటు కాలపరిమితిలో పరిశోధక విద్యార్థి ఉపకార వేతనం కూడా అందుకోబోతున్నారు.
డా. ఆలోక్ రాజ్ భట్ తెలంగాణ విశ్వవిద్యాలయంలోనే రెండు సం. లు 2009-11 వరకు ఎం బి ఎ పూర్తి చేసి, ఫస్ట్ విత్ డిస్టిన్షన్ తో ఉత్తీర్ణత సాధించారు. 2012 లో యు జి సి - నెట్ & జె ఆర్ ఎఫ్ ఉత్తీర్ణులయ్యారు. తర్వాత డా. కైసర్ మహ్మద్ పర్యవేక్షణలో 2019 "ద కాపిటల్ స్ట్రక్చర్" అనే అంశంపై పిహెచ్. డి. పరిశోధన చేసి, పట్టా పొంది డాక్టరేట్ సాధించారు. "డైరెక్ట్ టాక్సేషన్", "కాపిటల్ స్ట్రక్చర్ డిసిషన్" అనే శీర్షికలతో రెండు పుస్తకాలు ప్రచురించారు. మరో రెండు పుస్తకాలు ప్రచురణలో ఉన్నాయి. పరిశోధనలో అంతర్భాగంగా బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగపు తరగతులకు బోధించారు కూడా.
తెలంగాణ విశ్వవిద్యాలయంలోనే పీజీ, పిహెచ్.డి. చేసి అత్యంత ప్రతిభా పాటవాలను చూపి నేడు పిడిఎఫ్ సీటు సాధించిన డా. ఆలోక్ రాజ్ భట్ తెలంగాణ విశ్వవిద్యాలయంలోనే మొట్ట మొదటి విద్యార్థి అని పట్ల ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్ లు ప్రశంసించారు. ఎం.బి.ఎ. & కామర్స్ తదితర విభాగాల అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 18 Jan,2022 05:46PM