నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
మాక్లూర్ మండల సాక్షి దినపత్రిక విలేఖరి పోశెట్టి పై దాడి చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి దాడికి సూత్రధారులను అరెస్టు చేసి, హత్యాప్రయత్నం కింద కేసు నమోదు చేయాలని పీడిఎస్‌యూ, పివైఎల్ ఆధ్వర్యంలో ద్వారక నగర్ ఇఫ్టు కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు వనమల సత్యం, జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ మాక్లూర్ మండలం లో రైతుబంధు సంబరాల్లో భాగంగా జరిగిన కార్యక్రమానికి సంబంధించి జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విట్టల్ రావు, అట్లాగే నియోజకవర్గ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మధ్య విభేదాలు ,అవినీతిపై వార్తలు రాసినందుకు టిఆర్ఎస్ కార్యకర్తలైన గుంజిలి కి చెందిన రంజిత్, లక్కంపల్లి కి చెందిన మహేందర్ తో పాటు మరో వ్యక్తి కలిసిరోడ్డుపై కాపుకాసి పోశెట్టి అనే విలేకరిని కర్రలతో రాడ్లతో దాడి చేసారని అన్నారు. పత్రికాస్వేచ్చకు పత్రిక విలేకరులకు రక్షణ లేని పరిస్థితులు నిజామాబాద్ జిల్లాలో ఉండటం విచారకరమన, అధికార అవినీతిపై ప్రశ్నించినందుకు అధికార పార్టీ నాయకుల కు దౌర్జన్యాలకు అంతులేకుండా పోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు దేశెట్టి సాయిరెడ్డి, డివిజన్ అధ్యక్షులు వసరి సాయినాథ్, పిడిఎస్యు నగర ఉపాధ్యక్షులు సాయి కృష్ణ, పివైఎల్ జిల్లా నాయకులు దేవస్వామి, పోశెట్టి, సూరి బాబు, కత్తుల సాయిలు, దాసు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 18 Jan,2022 05:53PM