నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శ్రద్ధానంద గంజ్ మర్చంట్ అసోసియేషన్ హాల్ లో సీపీఐ మాజీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ అమరజీవి గడ్డం వెంకటరెడ్డి ప్రథమ వర్ధంతి సభ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఓమయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ వర్ధంతి సభకు ముఖ్యఅతిథిగా ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్.బోసు హాజరై మాట్లాడుతూ గడ్డం. వెంకటరెడ్డి 1970 సంవత్సరంలో ఏఐటీయూసీలో చేరి జిల్లాలో కార్మిక సంఘాలను ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర పోషించారని, 1987 జనవరి 9న (ఆరు నెలల పాటు) సోవియట్ యూనియన్ రష్యా కార్మిక రాజ్యం వెళ్లి రష్యాలో జరిగిన రాజకీయ తరగతులతో పాటు ఎర్రజెండా ప్రభుత్వం కార్మికులకు అమలు చేస్తున్న పథకాలను అధ్యయనం చేశారు అని, వెళ్లినందుకు ఉద్యోగం నుండి తొలగించిన సోవియట్ రష్యాలో పొందిన స్ఫూర్తితో జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కోపరేటివ్ సహకార సంఘం, ఆర్టీసీ, లారీ డ్రైవర్ అసోసియేషన్ ,రైస్ మిల్ హమాలి ,ఫిల్టర్స్, పాంతి లేబర్ మరెన్నో కార్మిక సంఘాలు నిర్మించారు.
ఏఐటీయూసీ జాతీయ కౌన్సిల్ సభ్యులు (న్యూఢిల్లీ) గా బాధ్యతలు నిర్వహించారు అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సీపీఐ పార్టీ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించి పార్టీ జిల్లా కార్యదర్శి, ఎఐటియుసి అనుబంధ రంగాలలో ఏన్నో పదవులను చేపట్టి పార్టీ కొరకు నిరంతరం కష్టపడి నటువంటి వ్యక్తిగా ఆయినను సీపీఐ ఎప్పుడూ మర్చిపోదుఅని, ఆయన ఆశయ సాధన కోసం పని చేయాలని అన్నారు. ఫిబ్రవరి 5,6,7 హైదరాబాద్లో జరిగే ఏఐటీయూసీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జయప్రదం చేయాలని కోరారు. దేశ వ్యాప్తంగా ఫిబ్రవరి 23,24 రెండు రోజుల సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక వర్గాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి భూమయ్య, జిల్లా సహాయ కార్యదర్శి పి.సుధాకర్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు దుబాయ్ రాములు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింగ్ రావు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రాజిరెడ్డి ,షేక్ బాబు, బొంబాయి గంగన్న, ఏఐటీయూసీ నాయకులు దేవేందర్, అనిల్,హనుమాన్లు, ముత్యాలు, వెంకటేశం గుప్తా తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 18 Jan,2022 06:11PM