నవతెలంగాణ కోడేరు
పేద ప్రజల కోసం శ్రమించిన మహనీయుడు ఎన్టీఆర్ అని టిడిపి మండల అధ్యక్షుడు ఓర్సు రామకృష్ణ అన్నారు. నందమూరి తారక రామారావు 26 వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ ఆ మహానుభావునికి నివాళులర్పించడం జరిగింది. మండల అధ్యక్షుడు ఓర్సురామకృష్ణ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు పేద ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చాటిచెప్పిన మహనీయుడు అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో నర్సాయిపల్లి శివ కృష్ణ, అంజనేయులు, రాజు, పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేయోభిలాషులు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొనడం జరిగినది.
Mon Jan 19, 2015 06:51 pm