నవతెలంగాణ - అశ్వారావుపేట
తెలుగు చిత్రసీమ,విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రేసేతర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 26వ వర్ధంతిని మంగళవారం నియోజక వర్గం కేంద్రమైన అశ్వారావుపేటలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక మూడు రోడ్ల కూడలిలో గల ఎన్.టి.ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, పార్టీ పతాకాన్ని అవనతం చేసిన అనంతరం నియోజక వర్గం పార్టీ ఇంచార్జి కట్రం స్వామి దొర ప్రసంగించారు.
ఆనాడు పార్టీ స్థాపించిన ఆనతికాలంలోనే అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత అన్న నందమూరిదేనని అన్నారు. పేద ప్రజలు రాగులు, సజ్జలు, సోల్లు, జొన్నలు తినే కాలంలో పేదవాడికి ఒక పూట అయినా వరి అన్నం తినే అవకాశం లేని రోజుల్లో రూ.2లకే కిలో బియ్యం ఇచ్చిన ఘనత ఆనాడు నందమూరి కే దక్కిందన్నారు. అలానే బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయాల్లో పెద్ద పీట వేసిన ఘనత కూడా అన్న ఎన్.టి.ఆర్ దక్కింది అన్నారు.అలాగే మహిళలకు 33% రాజకీయాల్లో అవకాశం కల్పించినందుకు ఆయనకు మహిళలు నీరాజనాలు పలికారని అన్నారు. పరిపాలనా పరంగా మండల వ్యవస్థను,రెవిన్యూ విభాగాలను చేసిన ఘనత కూడా అయినదే అన్నారు. కళా రంగంలో కూడా రాముడు, భీముడు, శ్రీకృష్ణుడు, కర్ణుడు, ధృతరాష్ట్రుడు, ఆ రోజుల్లో సాంఘిక, పౌరాణిక సినిమాలు నటించిన ఘనత కూడా ఆయనదే నని తెలిపారు. ఈ కార్యక్రమంలో నార్లపాటి శ్రీనివాసరావు, కార్యదర్శి అంకోలు వెంకటేశ్వరరావు, రామకృష్ణ, ఉదయ్, సురేష్, అంజి, రామారావు, వెంకటరత్నం, మేకా రవీంద్ర బాబు, నర్రా రాకేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 18 Jan,2022 06:15PM