నవతెలంగాణ డిచ్ పల్లి
తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బిక్నూర్ సౌత్ క్యాంపస్ లో గల మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ విభాగంలో గత 13 సంవత్సరాలుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ (కాంట్రాక్ట్)గా బాధ్యతలు అందిస్తున్న డాక్టర్ వి.లక్ష్మణ్ సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. డాక్టర్ వి.లక్ష్మణ్ ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి, సంతాపం ప్రకటిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలిపారు. ఆయన స్వగ్రామమైన జనగామలోని చేర్యాలలో జరిగిన అంతిమ యాత్రలో బిక్నూర్ క్యాంపస్ సోషల్ వర్క్ విభాగాధిపతి డా. వీరభద్రం,
డా.విజయకుమార్ శర్మ, డా. సుధాకర్ గౌడ్, డా. నర్సయ్య, డా. యాలాద్రి, డా. నారాయణ, డా. పురుషోత్తం, డా. శ్రీకాంత్, డా. శరత్, డా. రాజేశ్వర్, డా. రాహుల్, డా. దత్తహరు, వైశాల్, నిరంజన్ శర్మ తదితర అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm