నవతెలంగాణ-మంథని
సమాజమే దేవాలయం,ప్రజలే దేవుళ్ళు అంటూ పేదరికం లేని సమాజానికి బాటలు వేసిన తెలుగు ప్రజల ఆరాధ్య రాజకీయ నాయకులైనా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు రాష్ట్రానికి చేసిన సేవలు మర్చిపోలేనివని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాడి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆపార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం నియోజకవర్గంలోని మంథని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆనాడు బడుగు బలహీన వర్గాల ప్రజలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బిసి అన్ని కులాలకు పెద్దపీట వేశారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పెద్దపల్లి జిల్లా పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి మెండ.రాజయ్య,మండల పార్టీ అధ్యక్షులు మేదరవేన. ఓదెలు, మాదాడి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 18 Jan,2022 06:19PM