- బీజేవైఎం మండల అధ్యక్షులు వేల్పుల సత్యనారాయణ
నవతెలంగాణ-గోవిందరావుపేట.
ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ను వెంటనే విడుదల చేయాలని బీజేవైఎం మండల అధ్యక్షులు వేల్పుల సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాహశీల్దార్ రాజేశ్వరరావుకు మండల బీజేవైఎం అద్వర్యం లో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బీజేవైఎం మండల అధ్యక్షుడు వేల్పుల సత్యనారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం లో ప్రభుత్వం ఏర్పడి ఏడు సంవత్సరాలు గడిచిన ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చేయకుండా కాలక్షేపం చేస్తుంది రాష్ట్రంలో విద్యార్థులు నిరుద్యోగులు మనోవేదనకు గురి అయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రెండోసారి అధికారం లోకి వచ్చే ముందు నిరుద్యోగ భృతి ఇస్తాము అని హామీ ఇచ్చి మరిచారు. తక్షణమే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు మరియు నిరుద్యోగ భృతి నెలకి 3016 రూపాయలు ఇవ్వాలని గోవిందరవుపేట మండల తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు మద్దినేని తేజరాజు ప్రధాన కార్యదర్శి గజ్జెల రాకేష్ బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి కొలిపాక గౌతమ్ గుప్తా ,జిల్లా కార్యదర్శి జనార్దన్, గిరిజన మోర్చామండల అధ్యక్షుడు బాణోత్ ఈశ్వర్ నాయక్ బీజేవైఎం కార్యకర్తలు భాను ,సతీష్, మురళి, గురు ,అశ్విత్ , దిలీప్ ,విజ్ఞేష్ ,రాజేష్ ,రిషి ,సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 18 Jan,2022 07:30PM