నవతెలంగాణ-గోవిందరావుపేట
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి వేడుకలను మంగళవారం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు నర శివప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కార్యకర్తలు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ సీనియర్ నాయకులు జంపాల సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల్లో రాజకీయ చైతన్యం నింపింది ఎన్టీ రామారావు అన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆయన ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తుమ్మల రామకృష్ణ మల్లయ్య జోగా నాయక్ గుర్రం వేణు మరియు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm