- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి
నవతెలంగాణ కన్నాయిగూడెం
మండలంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి బృందం మిర్చిపంటలను సందర్చించారు. అకాల వర్షాల వల్ల మిర్చి పంటలను కోల్పోయిన రైతులను ఉద్యేశించి ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం మిర్చితోటలలో తామర పురుగు వచ్చి తోట కాయ కాయ కుండా మిర్చి పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయని అన్నారు. ఇప్పుడు మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు దెబ్బతిన్న మిర్చి తోటలపై గత ఐదు రోజులుగా కురిసిన వర్షాలకు మొక్కలు ఎండిపోతున్నాయని, అలాగే మిర్చి తోటలు నేలమట్టం అయి రైతులకు తీవ్ర పంట నష్టం వాటిల్లిందని అన్నారు. వెంటనే ప్రభుత్వం హార్టికల్చర్ డిపార్ట్ మెంట్ తో సర్వే చేయించాలని రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ వచ్చిగా మిర్చి తోటలు పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపాలని నష్టపోయిన రైతులకు ఎకరాకు లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని తమ పార్టీ డిమాండ్ చేస్తున్నదని అన్నారు. లేనియెడల ఆ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా నాయకుడు ఎండి దావూద్, మండల కన్వీనర్ కావేరి సుధాకర్, మంచాల రామారావు, చిడెం లక్ష్మణ్ రావు, కంపెల్లి సురేష్, ఎం డి భాష బి. రంజిత్ ,కార్యకర్తలు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 18 Jan,2022 07:43PM