- మండలంలో 14 మందికి సోకిన కరోనా...
నవతెలంగాణ - అశ్వారావుపేట:
సంక్రాంతి పండుగ ప్రభావంతో రాకపోకలు పెరగడంతో థర్డ్ వేవ్ అశ్వారావుపేట ను తాకింది. దీంతో మంగళవారం మండల వ్యాప్తంగా మూడు ఆసుపత్రులు పరిధిలో 14 మందికి కరోనా సోకింది.
అశ్వారావుపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో 11 మందికి,వినాయకపురం పి.హెచ్.సి పరిధిలో ఇద్దరికి, గుమ్మడవల్లి పి.హెచ్.సి పరిధిలో ఒక్కరికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ఆయా ఆసుపత్రులు వైద్యులు డాక్టర్ అనుదీప్, డాక్టర్ రాంబాబు, హరీష్ లు నిర్ధారించారు. అశ్వారావుపేట పంచాయితి పరిధిలో కెమిలాయిడ్స్ లో ఒకరికి,కోత మిషన్ బజారులో ఇరువురికి, నందమూరి నగర్ లో ఒకరికి, అశ్వారావుపేటలో ఇరువురికి, పోలీస్ స్టేషన్, వ్యవసాయ కళాశాలలో ఒక్కొక్కరికి, నారాయణ పురం పంచాయితీ, ఆసుపాక పంచాయితీలో ఒక్కొక్కరికి, బచ్చువారిగూడెం పంచాయితీ ప్రాజెక్ట్ కు హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక్కరికి పాజిటివ్ గా నిర్ధారించారు. థర్డ్ వేవ్ మండల వ్యాప్తంగా విచిస్తరించే అవకాశం ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 18 Jan,2022 07:52PM