నవతెలంగాణ-మంథని
మంథని మండలం ఆరెంద గ్రామంలో మంగళవారం భూలక్ష్మి దేవర గద్దె నుండి 120 మీటర్ల సి.సి రోడ్డును సి.ఎస్.ఆర్ నిధుల నుండి మంజూరు మంజూరైన సిసి రోడ్డు నిర్మాణానికి మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. త్వరలోనే పనులు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు సేగ్గం రాజేష్, రవికంటి సతీష్, కుడుదలవెంకన్న, బాపు,తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm